Monthly Archives: డిసెంబర్ 2011

నమో విశ్వకర్మ!!!


విశ్వకర్మ భగవాన్ అందరి దేవుడు.
శా‖ పంచవక్త్రం జటాజూటం పంచదశ విలోచనం సద్యోజాతా ననం స్వేతం వామదేవంతు కృష్ణకం ‖
తత్పురుషం పీతవర్ణం చ ఈశానం శ్యామవర్ణకం అఘోరం రక్తవర్ణంచ శరీరం హేమవర్ణకం ‖
దశబాహుం మహాకాయం కర్ణకుండల మండితం పీతాంబరం పుష్పమాలా నాగయజ్ఞోపవీతనం ‖
రుద్రాక్ష మాలా భరణం వ్యాఘ్రచర్మోతరీయకం అక్షమాలాంచ పద్మంచ నాగసూల పినాకినం ‖
డమరుం వీణ భాణంచ శంఖచక్ర గదాన్వితం కోటిసూర్య ప్రతీకాశం సర్వ జీవా దయాపరం ‖
దేవదేవం మహాదేవం విశ్వకర్మా జగద్గురుం ప్రసన్నవదనంధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే ‖
రాక్షాసానాంగు రేర్ శుక్రుః దేవతానం బృహస్పతేర్గురుః సర్వలోక ప్రతీకాశం విశ్వకర్మ జగద్గురుః ‖
విశ్వకర్మ స్వయంభు
నభూమి న జలం ఛైవనతేజో నచవాయుతాఃనచ బ్రహ్మా నచ విష్ణు ర్నచ రుద్రశ్చ తారకాఃసర్వశూన్య నిరాలంబం స్వయంభూ విశ్వకర్మణః భూమి, ఆకాశం, జలము, అగ్ని, వాయువు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుఢు, ఇంద్రుఢు, సూర్యుఢు, నక్షత్రములు, చంద్రుఢు, మొదలైన రూపము లేమియును లేక సర్వ శూన్యమై యున్న కాలమందు స్వయంభూ విరాడ్విశ్వకర్మ బ్రహ్మ స్వరూపమై యుండెను.

పరమాత్మ దేవ దేవ
ఎవడు స్వయంభువుండు స్థిరుడెవ్వడు సృష్ఠికి మూలమైనవాడెవడు సమస్త భూతముల నేలుచునంతటి నిండియున్న వాడెవడు నిరామయుండు పరుడెవ్వడు సత్ర్పవ స్వరూపుడైయెవడు వెలుగు నట్టి జగతేక ప్రభున్ భజింతు నెమ్మదిన్

ప్రకటనలు